బెల్లంకొండ శ్రీనివాస్ తో తేజ సినిమా..

274
teja, bellamkonda srinivas
- Advertisement -

ద‌ర్శ‌కుడు తేజ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మంచి విజ‌యాన్ని సాధించాడు. చాలా రోజులుగా ఫెయిల్యూర్స్ తో బాధ‌ప‌డుతోన్న తేజ కు భారీ విజ‌యం రావ‌డంతో అవ‌కాశాలు కూడా బాగానే వ‌స్తోన్నాయి. ఎన్టీఆర్ బ‌యోపిక్ కు మొద‌ట ద‌ర్శ‌కుడిగా పనిచేస్తాన‌ని ఆ త‌ర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. అంత పెద్ద సినిమాకు తాను న్యాయం చేయ‌లేనేమో అనే కార‌ణంతో సినిమా నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు తెలిపాడు. ఆ త‌ర్వాత విక్ట‌రీ వెంక‌టేష్ తో సినిమా చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

bellamkonda srinivas

ప‌లు కార‌ణాల వ‌ల్ల తేజ ఆ సినిమాను కూడా ఆపేశాడ‌ని సమాచారం. మ‌ళ్లి రానాతో ఓ సినిమా తీయ‌నున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపించాయి. ఆయ‌న ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్ట్స్ ల‌తో బిజీగా గ‌డ‌ప‌డం వ‌ల్ల ఆ సినిమా కూడా పక్క‌న పెట్టిన‌ట్టు తెలుస్తోంది. నేనే రాజు నేనే మంత్రి సినిమా త‌ర్వాత ఇంత వ‌ర‌కూ సినిమాను చేస్తున్న‌ట్లు అధికారంగా ప్ర‌క‌టించ‌లేదు ద‌ర్శ‌కుడు తేజ‌. ఈసంద‌ర్భంగా తేజ ఎవ‌రితో సినిమా చేస్తాడా అని ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఇక డైరెక్ట‌ర్ తేజ‌కు సంబంధించిన ఓ వార్త ఫిలిం న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Bellamkonda-sreenivas, kajal
బెల్లంకొండ శ్రీనివాస్ తో తేజ త‌రువాతి సినిమా ఉంటుంద‌ని స‌మాచారం. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ కాజ‌ల్ జంట‌గా వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో ఓ సినిమా చేస్తోన్నారు. ఈమూవీకి శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. త్వ‌ర‌లోనే ఈచిత్రం విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తోన్నారు చిత్ర‌యూనిట్. చివ‌ర‌కు తేజ ఎవ‌రితో సినిమా తీస్తాడో అని వేచి చూస్తోన్నారు అభిమానులు.

- Advertisement -