అహింసే మహాత్ముడి…ఆయుధం

44
- Advertisement -

విశ్వాసం,కార్యాచరణ,ప్రజాకర్షణ అనే మూడింటిని తన జీవితంలో భాగస్వామ్యం చేసుకుని ప్రజల మన్ననలు పొందిన మహానీయుడు మహాత్మ గాంధీ. ఓ వైపు స్వాతంత్య్ర పోరాటం కొనసాగిస్తూనే మరోవైపు శాంతి సామరస్యాల కోసం ఉద్యమించిన రాజకీయ వేత్త. మార్పు కోసం సాగే పోరులో నీతి,అహింస,ప్రజాస్వామ్య హక్కులు ముఖ్యమని చాటిచెప్పిన నిరాండబరుడు గాంధీ. ప్రపంచ వ్యాప్తంగా గాంధీ సిద్ధాంతాలతో స్పూర్తి పొందిన మహానీయులు ఎందరో.

భారత స్వాతంత్రోద్యమంలో ఏ రాజకీయనాయకుడు అవలంభించని ‘అహింసావాదం’ ప్రపంచంలోని ప్రజలందరినీ ఆశ్చర్యపరిచింది. భారతదేశ స్వాతంత్ర్య సమరంలో కూడా గాంధీ తన అద్భుత అస్త్రం “అహింస” ద్వారానే తెల్లదొరల కఠిన హృదయాలను కరిగింపచేయగలిగారు. గాంధీజీ మానవతావదం, ఓర్పు, శాంతి, అహింసా సిద్దాంతాల గురించి ప్రపంచమంతా ప్రచారమయింది. మహిమలు లేకపోయినా, తను నమ్ముకున్న బాట అయిన ‘అహింస’ ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసి ‘మహాత్ముడి’గా గుర్తింపు పొందిన మహాత్మాగాంధీని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి.

మహాత్మా గాంధీ ప్రపంచానికి అందించిన అహింసా విధానాలను గౌరవిస్తూ ఈయన పుట్టిన రోజునే ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం’గా జరుపుతారు. ఇరాన్‌కు చెందిన నోబెల్‌ గ్రహీత షిరిన్‌ ఎబాడీ ప్రతిపాదన మేరకు అక్టోబర్‌ 2ను 2007 జూన్‌ 15న ఐక్యరాజ్యసమితి ఈ విధంగా ప్రకటించింది. గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అహింస ప్రాధాన్యతపై అవగాహన కల్పించే రకరకాల కార్యక్రమాలు జరుపుతారు.

గాంధీజీకి దక్షిణాఫ్రికాతో ఎంతో అనుబంధం ఉంది. అక్కడ ఆయనకి ఎంతో ఆదరణ ఉంది. జోహెన్స్‌బర్గ్‌లో ఈరోజు గాంధీజీకి ఘనంగా నివాళులు అర్పిస్తారు. ప్రత్యేక ప్రార్థనలతో మొదలుపెట్టి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. 1893లో గాంధీజీని రైల్లోంచి బయటకు తోసేసిన పీటర్‌మారిట్జ్‌బర్గ్‌ ప్రాంతంలోనూ గాంధీజీని స్మరిస్తూ కార్యక్రమాలు జరుపుతారు.

Also Read:హైదరాబాద్‌లో డీజే పై నిషేధం..

- Advertisement -