కొందరు మలవిసర్జన చేసినప్పుడు మలంలో నులిపురుగులు కనిపిస్తుంటాయి. ఇవి సన్నగాను లేదా కొందరిలో పెద్ద సైజు లోనూ ఈ పురుగులు కనిపిస్తుంటాయి. ఈ నులిపురుగుల సమస్య ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో పెద్దల్లో కూడా ఈ సమస్య ఎక్కువగానే ఉంది. ఈ నులిపురుగుల సమస్య ఉన్నవారికి అతిగా ఆకలి వేయడం లేదా ఆకలి మందగించడం, కడుపు ఉబ్బరంగా ఉండడం, రక్త హీనత, మలద్వారం వెంబడి దురద, దగ్గు, వికారం, వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. .
ఈ నులిపురుగుల సమస్య నుంచి బయట పడడానికి వైద్యుడిని సంప్రదించి సరైన మెడిసన్స్ తీసుకుంటూ ఉంటాము. అయితే ఈ నులిపురుగుల సమస్యలు ఇంటి చిట్కాలు కూడా అద్భుతంగా పని చేస్తాయి. ముఖ్యంగా నులిపురుగుల నివారణకు జీలకర్ర చక్కగా ఉపయోగ పడుతుంది. జీలకర్రలో ఉండే యాంటీ బయోటిక్ గుణాలు నులిపురుగులు వృద్ది చెందకుండా చేస్తాయి. జీలక్కరను ప్రతిరోజూ నమిలి ఆ రసాన్ని మింగడం వల్ల కడుపులో నులిపురుగులు తగ్గుతాయి. ఇంకా జీలకర్ర కషాయం ప్రతిరోజూ ఉదయం పడగడుపున తాగడం వల్ల గ్యాస్, మలబద్దకం, ఉబ్బరం వంటి పలు రకాల ఉదర సమస్యలు కూడా దురమౌతాయి. ఇక నులిపురుగుల సమస్య ఉన్న వాళ్ళు ఇంకా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటో చూద్దాం.
Also Read:అవిశ్వాస తీర్మానం.. మోడీకే అనుకూలమా?
* ప్రతిరోజూ కాచి చల్లార్చిన నీటినే త్రాగలి.
* రోజుకు నీరు కుడా ఎక్కువగా త్రాగలి
* ఏదైనా తినే టైమ్ లో చేతులను శుబ్రంగా కడుక్కోవాలి. ఇంకా పండ్లు, కూరగాయలు వంటివి కడిగి తినడం మంచిది.
* మలవిసర్జన చేసిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
ఇలాంటి జాగ్రతలు పాటించడం వల్ల నిలిపురుగుల సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు.
Also Read:చంద్రబాబుకు జనసేన దెబ్బ!