5జీ…నిమిషంలో సినిమా డౌన్‌లోడ్!

77
5g
- Advertisement -

దేశంలో త్వరలో రిలయన్స్ 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే శరవేగంగా పనులు సాగుతుండగా తొలుత దేశంలోని 13 మెట్రో నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

4జీ నెట్‌వర్క్ కంటే 5జీ నెట్‌వర్క్ డౌన్‌లోడ్ స్పీడ్ 8రెట్లు వేగంగా ఉండనుంది. కేవలం ఒక్క నిమిషంలో రెండు గంటల సినిమాని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 5జీ ట్రయల్స్‌ సమయంలో మెరుగైన ఫలితాలు వచ్చాయి.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, గురుగ్రామ్, చండీగఢ్, బెంగుళూరు, అహ్మదాబాద్, జామ్‌నగర్, హైదరాబాద్, పూణే, లక్నో, గాంధీనగర్‌లతో సహా కొన్ని నగరాల్లో 5G లాంచ్ జరుగునుంది. అయితే, 5జీ వస్తే మాత్రం ఆ నెట్‌వర్క్ ప్లాన్‌ల రేట్లు బాగా పెరిగే అవకాశం ఉంది.

- Advertisement -