బాధితులకు అండగా జీవో 118..

220
- Advertisement -

ఎల్బీనగర్, మేడ్చల్, రాజేంద్రనగర్, కార్వాన్, జూబ్లీహిల్స్, నాంపల్లి నియోజకవర్గాల పరిధిలోని ఇండ్ల నిర్మాణ క్రమబద్దీకరణ సమస్యకు తెలంగాణ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. జీఓ 118ను విడుదల చేసి బాధితులకు అండగా నిలిచింది.

సరూర్‌నగర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన మన నగరం కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖల మంత్రి కేటీఆర్ పాల్గొని తెలంగాణ ప్రభుత్వం…ఎల్బీనగర్, మేడ్చల్, రాజేంద్రనగర్, కార్వాన్, జూబ్లీహిల్స్, నాంపల్లి నియోజకవర్గాల పరిధిలోని ఇండ్ల నిర్మాణ క్రమబద్దీకరణ సమస్యకు పరిష్కారం వినిపించారు. జీఓ 118 ప్రకారం కనీస ఛార్జీతో సదరు భూములను క్రమబద్ధీకరించుకోవచ్చని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చేయడానికి జీఓ 118 విడుదలకు కొంత సమయం తీసుకున్నామని చెప్పారు. దీంతో 6 నియోజకవర్గాల్లోని 44 కాలనీల వాసులకు తక్షణ ఉపశమనం లభిస్తుందన్నారు. గత పాలకులు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇచ్చి… ఇండ్లు నిర్మించుకున్నాక నిషేధిత జాబితోలో చేర్చి ఇబ్బందులు పెట్టారు. ఇదెక్కడి న్యాయం. కొడుకు పెండ్లి.. బిడ్డ చదువులు ఎలా అని చాలా మంది బాధితులు గోడువెల్లబోసుకున్నారు. అనేక విజ్ఞప్తులు చేశారు. అయినా వారెవ్వరూ ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయలేదని కేటీఆర్ గుర్తు చేశారు. వెయ్యి గజాల వరకు ఉండే ప్రతి ఒక్క నిర్మాణాన్ని రెగ్యులరైజ్‌ చేస్తున్నామని స్పష్టం చేశారు.

కేవలం నామినల్‌ ఛార్జీతో గజానికి రూ. 250తో ప్రక్రియ చేసుకోవచ్చని వివరించారు. ఆరు నెలల్లో రెగ్యులరైజేషన్‌ చేయించి మీ చేతుల్లో పట్టాలు పెడుతామని చెప్పారు. పేదలకు, మధ్యతరగతి ప్రజలకు మేలు చేసిందే తప్ప నష్టం చేయలేదు అని అన్నారు. ప్రజల ముఖాల్లో చిరునవ్వు కోరుకునే సర్కార్‌ అని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పొచ్చు. ఎల్బీనగర్‌ చౌరస్తా 8 ఏండ్ల కింద ఎట్ల ఉండే.. ఈ రోజు ఎట్ల ఉందో.. అదొక్కటే చాలు సర్కార్‌ ఏంటని చెప్పడానికి అని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా, మహమూద్‌ అలీ, మలారెడ్డిలు, పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

తెలంగాణలో మీ గుండాయిజం చెల్లదు:కేటీఆర్‌

మునుగోడు బిజెపికి ప్రతిష్టాత్మకమే

పదిలో పదకొండు కాదు..ఆరు పేపర్లు

- Advertisement -