‘హరిహర వీరమల్లు’ నుండి అదిరిపోయే సర్‌ప్రైజ్‌..

105
pawan

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా అభిమానుల‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు మేక‌ర్స్.. గురువారం ఉదయం ‘భీమ్లా నాయక్‌’ టైటిల్‌ సాంగ్‌తో అలరించిన పవన్‌ తాజాగా తన తదుపరి చిత్రం హరిహర వీరమల్లు విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 29, 2022న చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.

ఈ చిత్రాన్ని క్రిష్‌ దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్‌ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ప్యాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌ వజ్రాల దొంగగా కనిపిస్తారని, ఇప్పటి వరకూ ఏ చిత్రంలో కనిపించని కొత్త లుక్‌లో ఆయన కనిపిస్తారని చిత్ర యూనిట్‌ నుంచి సమాచారం. ఇందులో పవన్‌కల్యాణ్‌ సరసన నిధీ అగర్వాల్‌ నటిస్తున్నారు.

అలాగే పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న 29న చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ కూడా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న నూతన చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘యథా కాలమ్‌.. తథా వ్యవహారమ్‌’ అని పోస్టర్‌పై ఉన్న స్లోగన్‌ ఆకట్టుకుంటుంది.