బాలీవుడ్ న‌టుడు సిద్ధార్థ్ శుక్లా మృతి..

87

బాలీవుడ్ న‌టుడు సిద్ధార్థ్ శుక్లా(40) మృతి చెందాడు. ఆయ‌న ఈ రోజు ఉద‌యం ఇంట్లో గుండెపోటుకు గురికాగా, ఆయ‌న‌ను కుటుంబ స‌భ్యులు కూప‌ర్ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ఆయ‌న‌ను పరీక్షించిన వైద్యులు ఆయ‌న అప్ప‌టికే ప్రాణాలు కోల్పోయాడ‌ని చెప్పారు. సిద్ధార్థ్ కు తల్లి, ఇద్దరు అక్కలు ఉన్నారు.

సిద్ధార్థ్‌ తన కెరీర్‌ని మోడల్‌గా షోబిజ్‌లో ప్రారంభించిన ఆయన ‘బాలికా వధూ’లో ప్రధాన పాత్ర పోషించారు. అలాగే టెలివిజన్ షో ‘బాబుల్ కా ఆంగన్ చూటే నా’లో ప్రధాన పాత్ర పోషించాడు. తరువాత ‘జానే పేచానే సే.. యే అజ్ఞబ్బి’,’లవ్ యు జిందగీ’ వంటి కార్యక్రమాలలో కనిపించాడు. ఇక 2014లో కరణ్ జోహార్ నిర్మించిన ‘హంప్టీ శర్మ కి దుల్హనియా’ మూవీతో సిద్ధార్థ్ శుక్లా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. బిగ్ బాస్ సీజన్ 13 విన్నర్‌గా సిద్దార్థ్ నిలిచాడు.