సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, డేటింగ్ ఇవి కామన్… సినిమా హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమయాణాలు అంటూ రకరకాల వార్తలు నిత్యం హల్ చల్ చేస్తుంటాయి. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, డేటింగ్, రిలేషన్‌షిప్స్ వంటివి కొత్తేమికాకపోయినా.. నిత్యం ఆసక్తినిరేకిస్తుంటాయి. తాజాగా టాలీవుడ్ లో మరోజంట ప్రేమలో ఉందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చేస్తోంది.
టాలీవుడ్ ముద్దుగుమ్మ రెజీనాతో హీరో సందీష్ కిషన్ ప్రేమాయణం సాగిస్తున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి వారిద్దరూ దిగిన ఫోటోలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆ ఫోటోలో సందీప్ కిషన్ రెజీనాతో చాలా క్లోజ్ గా ఉండటం కనిపించింది. ఈ నేపధ్యంలో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే టాక్ బయటకి వచ్చింది. సందీప్, రెజీనా డేట్ లో ఉన్నారని కోలీవుడ్ సర్కిల్ లో కోడై కూస్తోంది . ఈ విషయాన్ని వారు కెరియర్ పరంగా గోప్యంగా ఉంచడానికి ట్రై చేస్తున్నారని ప్రచారం తెరపైకి వచ్చింది. గతంలో రెజీనా, సాయి ధరమ్ తేజ్ మధ్య ఏదో ఉందనే ప్రచారం నడిచింది. అయితే ఈ వార్తలపై ఇటు రెజీనా.. అటు సాయిధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చి ఆ వార్తలకు పుల్ స్టాప్ పెట్టారు. తాజాగా రెజీనా, సందీష్ కిషన్ లమధ్య ఏదో నడుస్తోందంటూ వస్తున్న వార్తలపై వారిద్దరు ఎలా స్పందిస్తారో చూడాలి.