రెజీనా కెసాండ్రా తన అందం,అభినయంతో కుర్రకారును కట్టిపడేసే హీరోయిన్. స్టార్ హీరోయిన్ కు ఉండాల్సిన అన్ని లక్షణాలు పర్ ఫెక్ట్ గా ఉన్నాయి. కోలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన బ్యూటీ నటనలో మంచి మార్కులే కోట్టేసింది. కానీ అగ్ర కథానాయకుల సరసన అవకాశాలు మాత్రం రావడం లేదు. అందాల ఆరబోతకు అడ్డు చేప్పని రెజీనా తాజాగా ఓ తమిళంలో నటిస్తోంది. ఆ మూవీతో యువత మతులు పోగొట్టింది.
రెజీనా హీరోయిన్‌గా Mr. చంద్రమౌళి సినిమా వస్తోంది. ఈ మూవీలో సీనియర్ కోలీవుడ్ హీరో కార్తీక్ కొడుకు గౌతమ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఏదేదో ఆనేనే.. అనే సాంగ్ ఉంది. ఈ సాంగ్‌లో రెజీనా ఇంతకు ముందెన్నడూ లేనంత హాట్ గా కనిపించి చూపరులకు హీటెక్కించేసింది. పాట స్టార్టింగ్‌లో టూ పీస్ బికినీలో కనిపించి అదరగొట్టేస్తుంది. ఈ సాంగ్ లో రెజీనా చాలా కాస్ట్యూమ్స్ లో కనిపిస్తుంది. ప్రతి ఒక్క డ్రస్సులోనూ ఇంకా ఇంకా అందంగా కనిపిస్తుంది.
టాలీవుడ్ సినిమాల్లోనూ రెజీనా హాట్ హాట్ అందాలు చూపించింది. కానీ మరీ ఈ రేంజిలో ఇంతకు ముందెన్నడూ అందాలు ఆరబోయలేదు. అసలు ఈ పాట స్క్రీన్ పై వస్తున్నంత సేపు ఈ సెక్సీ భామ వైపు నుంచి చూపు తిప్పుకోవడం చాలా కష్టం. పాటలో భాగంగా వచ్చే ఇంటిమేట్ సీన్లలో ఆమె ఎక్స్ ప్రెషన్లు కొన్నాళ్లపాటు గుర్తుండిపోతాయి. రెజీనాను ఈ పాట చూశాక ఆమె అందానికి ప్రేక్షకులు ముగ్దులు అవ్వాల్సిందే.