రెజీనా….నేనేనా..?

175
nene naa
- Advertisement -

టాలీవుడ్‌లో మంచి హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది రెజీనా కసాండ్ర. మద్యలో కొంత గ్యాప్ వచ్చినప్పటికి మళ్ళీ వరస సినిమాలలో అవకాశాలను అందుకుంటు సక్సస్‌లు తన ఖాతాలో వేసుకుంటుంది. ప్రస్తుతం నేనేనా అనే మూవీలో నటిస్తోంది రెజీనా.

అయితే ఈ సినిమాలో ఆమె పురావస్తు శాస్త్రవేత్తగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. తమిళంలో ‘శూర్పణగై’ (శూర్పణఖ) అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు.

కార్తీక్‌ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ మంగళవారం ఆరంభమైంది. హారర్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రెజీనా పరిశోధన ఆసక్తికరమైన సంఘటనలకు దారి తీస్తుందట. మరి చాలాకాలం తర్వాత వస్తున్న రెజీనా ఈ సినిమాతో ఆకట్టుకుంటుందా లేదా వేచిచూడాలి.

- Advertisement -