ఒక్క డెల్టా కేసుతో ఆ దేశంలో లాక్‌డౌన్!

319
New Zealand Prime Minister
- Advertisement -

ఒకే ఒక డెల్టా కేసు నమోదుకావడంతో ఆ దేశంలో లాక్ డౌన్ విధించారు. న్యూజిలాండ్​లో లోకల్​ ట్రాన్స్​మిటెడ్​ కరోనా కేసు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడ్రోజుల లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు.

ఆక్లాండ్​లో ఓ 58 ఏండ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు తాజాగా గుర్తించారు. దీంతో మంగళవారం రాత్రి నుంచి దేశంలో మూడ్రోజుల పాటు.. ఆక్లాండ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వారం పాటు లాక్ డౌన్ విధించారు. దాదాపు 50 లక్షల జనాభా ఉన్న న్యూజిలాండ్​లో అక్కడి ప్రభుత్వం కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.

గత ఆరు నెలలుగా లోకల్​ ట్రాన్స్​మిటెడ్​ కేసులు నమోదు కానప్పటికీ.. డెల్టా వేరియెంట్​తో ప్రమాదమున్నందున చాన్స్ తీసుకోదలుచుకోలేదని ఆమె స్పష్టంచేశారు. అలసత్వంతో ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువ కాలం పాటు లాక్ డౌన్​లో ఉండాల్సి వస్తుందని చెప్పారు.

- Advertisement -