చినజీయర్ క్షమాపణలు చెప్పాలి: రేగా

57
rega
- Advertisement -

వన దేవతలు సమ్మక్క-సారలమ్మలపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు…..చినజీయర్ స్వామిపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు.

ఆదివాసీ ఆరాధ్య దైవాలు సమ్మక్క సారమ్మలను కించపరుస్తూ మాట్లాడిన చినజీయర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ గుడేలలో చినజీయర్ దిష్టిబొమ్మలను తగులబెట్టాలని రేగా కాంతారావు పిలుపిచ్చారు. రూపం లేకపోయినా ఆదివాసీ వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలను కోట్లాదిమంది కొలుస్తున్నారని అన్నారు.

మరోవైపు చినజీయర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది.ఆదివాసీల ఆడబిడ్డల చరిత్ర తెలియని జీయర్‌ స్వామికి వారి గురించి మాట్లాడే హక్కు లేదని డివిజన్‌ అధ్యక్షుడు మల్లు దొర అన్నారు.

వన దేవతలు సమ్మక్క సారలమ్మను అవమానించేలా చినజీయర్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాళ్లేమన్నా బ్రహ్మలోకం నుంచి దిగొచ్చారా? ఎవరు వాళ్లు.. అడవి దేవతలు.. పూజలు చేస్తే చేసుకోండి.. తర్వాత అక్కడ బ్యాంకులు ఏర్పడ్డాయి,పెద్ద బిజినెస్‌ గా మారిపోయిందని…చెడును సమాజంలో ప్రచారం చేస్తున్నారని మాట్లాడారు చినజీయర్. ఇదే ఇప్పుడు ప్రజల ఆగ్రహానికి గురైంది.

- Advertisement -