రెడ్డమ్మ తల్లి… ప్రొమో సాంగ్

274
aravinda sametha
- Advertisement -

ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అరవింద సమేత’ దసరా సీజన్‌లో విడుదలై వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఈ సినిమాకు పోటీ లేకపోవడంతో పాటు వరుస సెలవుల నేపథ్యంలో రాఘవ రెడ్డి జనాన్ని థియేటర్ల దాకా రప్పిస్తున్నాడు. ఇందులో చేప్పుకోవల్సిన విషయం ఏంటంటే..తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమాలో ఉన్న నాలుగు పాటలు ప్రేక్షకులను ఎంతగానో అకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ సినిమా నుండి రెడ్డ‌మ్మ త‌ల్లి వీడియో ప్రోమో విడుద‌ల చేశారు. ఇది ఎన్టీఆర్ అభిమానులనే కాక‌, సంగీత ప్రియుల‌ని ఆక‌ట్టుకుంటుంది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తి బాబు, ఈషా రెబ్బా, న‌వీన్ చంద్ర‌, నాగ బాబు ముఖ్య పాత్ర‌లు పోషించారు.

నవంబర్‌ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు యంగ్ టైగర్ తెలుగు రాష్ట్రాల నుండి షుమారు 70 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల షేర్ మార్క్‌ను దాటడం విశేషం.

- Advertisement -