పాకిస్థాన్ బ్యూటీ ‘రెడ్ మిర్చీ’ రెడీ..

226
Red Mirchi Telugu Movie
- Advertisement -

పాకిస్థాన్ కథానాయకి వీణామాలిక్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రెడ్ మిర్చీ’. కన్నడలో తెరకెక్కిన ‘సిల్క్’ చిత్రం.. కన్నడ సినీ చరిత్రలో కొత్త రికార్డులను నెలకొల్పి, 25 కోట్లు వసూలు చేయడమే కాకుండా, 150 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘రెడ్ మిర్చీ’ పేరుతో.. పి.వి.యన్ సమర్పణలో నైన్ మూవీస్ సంస్థ అందిస్తోంది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని యం.జి.యం డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.

Red Mirchi Telugu Movie

ఈ సందర్భంగా నిర్మాత కరణ్ మాట్లాడుతూ.. ‘‘కన్నడ చిత్ర సీమలో సెన్సేషనల్ విజయంతో టాక్‌ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సెన్సార్ చిక్కులను అధిగమించిన మా ‘రెడ్ మిర్చీ’ని సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నాము. ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందని ఎంతో నమ్మకంతో ఉన్నాం.. ’’ అన్నారు.

Red Mirchi Telugu Movie

వీణామాలిక్, అక్షయ్ జంటగా నటించిన ఈ చిత్రంలో సన, షఫీ, సాదుకోకిల, అవినాష్ మొదలగువారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: జెస్సీగిఫ్ట్స్, కెమెరా: జైఆనంద్, ఎడిటర్: సంజీవరెడ్డి, మాటలు,పాటలు: భారతీబాబు, సమర్పణ: పి.వి.యన్, విడుదల: యం.జి.యం డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాత: కరణ్, దర్శకత్వం: త్రిశూల్.

- Advertisement -