Lokesh:’రెడ్ బుక్’ తెచ్చిన తంటా!

23
- Advertisement -

ఎన్నికల వేళ నారా లోకేష్ రెడ్ బుక్ ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ లీడర్ల అవినీతి చిట్టా అంతా తన దగ్గర ఉందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయంలో విర్రవీగిన వారిని భరతం పడతామని నారా లోకేశ్ తరచూ వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే నియోజక వర్గాల వారీగా వైసీపీ లోని కొందరి పేర్లను రెడ్ బుక్ గా తయారు చేసినట్లు స్వయంగా లోకేశ్ చాలా సార్లు చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడిదే లోకేష్ ను చిక్కుల్లోకి నెట్టేలా కనిపిస్తోంది. రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారంటూ వైసీపీ లీడర్లు సీబీఐ కోర్టులో ఆ మద్య పిటిషన్ కూడా దాఖలు చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై కోర్టు తీర్పునిస్తూ కేసును ఈ నెల 21కి వాయిదా వేసింది. రెడ్ బుక్ పేరుతో లోకేష్ చేస్తున్న బెదిరింపులు 41ఏ కు విరుద్ధంగా ఉన్నాయనేది వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట. దీంతో ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. .

ఒకవేళ ఈ కేసును ధర్మాసనం సీరియస్ గా పరిగణిస్తే.. లోకేష్ కు కొత్త చిక్కులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే వ్యవహారం ప్రజల్లో కూడా లోకేష్ ఇమేజ్ ను డ్యామేజ్ అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం. ఎందుకంటే తాము అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తామో చెప్పకుండా.. వైసీపీ పై కక్ష సాధించేందుకే తమ అధికారం అన్నట్లుగా లోకేష్ శైలి ఉందనే భావన ప్రజల్లో కలిగే అవకాశం ఉంది. అందువల్ల లోకేష్ చెబుతున్న రెడ్ బుక్ వల్ల వైసీపీకి ఎంతమేర నష్టం జరుగుతుందో గాని ఎన్నికల ముందు టీడీపీకి నష్టం కలిగించడం మాత్రం ఖాయమనేది కొందరు విశ్లేషకులు చెబుతున్న మాట. మరి రెడ్ బుక్ విషయంలో లోకేష్ యు టర్న్ తీసుకుంటారా ? లేదా అవేవీ పట్టించుకోకుండా ఎన్నికల ముందు కూడా రెడ్ బుక్ ను హైలెట్ చేస్తారా ? అనేది చూడాలి.

Also Read:ప‌న‌స పండ్లు ఎక్కువ‌గా తింటున్నారా?

- Advertisement -