బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తుఫాన్ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అక్టోబర్ 28, 29 తేదీలకు సంబంధించి పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ తుఫాన్ గురువారం తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
భారత వాతావరణ శాఖ సోమవారం, అక్టోబర్ 26న వెల్లడించిన వివరాల ప్రకారం.. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలపడి ‘అర్నబ్’ తుఫాన్‌గా మారింది.సోమవారం ఉదయం 5.30 గంటల సమయానికి ఈ తుఫాన్ తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది.
వివిధ ప్రాంతాలకు ఎంత దూరంలో ఉంది?
సోమవారం ఉదయం నాటికి తుఫాన్ ఉన్న ప్రాంతం నుంచి దూరాలు ఇలా ఉన్నాయి:
శ్రీ విజయ పురం (అండమాన్ దీవులు): 590 కిలోమీటర్లు వాయవ్య దిశలో
గోపాల్పూర్ (ఒడిశా): 610 కిలోమీటర్లు ఆగ్నేయ దిశలో
విశాఖపట్నం: 650 కిలోమీటర్లు తూర్పు-ఆగ్నేయ దిశలో
కాకినాడ: 730 కిలోమీటర్లు తూర్పు-ఆగ్నేయ దిశలో
మచిలీపట్నం: 830 కిలోమీటర్లు తూర్పు దిశలో
బాపట్ల: 910 కిలోమీటర్లు తూర్పు దిశలో
బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం
Also Read:TTD:తిరుమలలో భక్తుల రద్దీ
తుఫాన్ గురువారం ఆంధ్రప్రదేశ్, యానాం తీరాల మధ్య బాపట్ల, విశాఖపట్నం ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని కథనం పేర్కొంది. తుఫాన్ కదలికలు, తీవ్రత ఆధారంగా తీరం దాటే ప్రాంతం, సమయం మారవచ్చు.
తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక హెచ్చరికలను పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

