కేరళలో రెడ్‌ అలర్ట్‌…

126
kerala
- Advertisement -

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి పెను తుపాను మారిన సంగతి తెలిసిందే. ఈ తుపానుకు తౌక్టేగా నామకరణం చేయగా ఈ నెల 18న గుజరాత్ వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపాను ప్రభావం ఉన్న ఐదు రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు పంపించారు.

ఇక కేరళలో శనివారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మలప్పురం, కోజికోడ్‌, కన్నూర్‌, వయనాడ్‌, కాసర్‌గోడ్‌తో సహా ఉత్తర జిల్లాలో 20 సెంటీమీటర్ల కంటే భారీ వర్షాపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ మేరకు అధికారులు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

కోజికోడ్ జిల్లాలోని వడకర గ్రామంలో వంద కుటుంబాలకు 310 మందితో పాటు లోతట్టు, తీర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో కాసరగోడ్‌లో అలలు ఎగిపడుతున్నాయి. చెరంగై తీరానికి సమీపంలో ఇండ్లు మునిగిపోయాయి.

- Advertisement -