కరోనా బాధితులకు అండగా ‘వైఎస్‌ఎస్‌ఆర్‌ టీం’: షర్మిల

47
covid patients

కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందకొచ్చారు వైఎస్ షర్మిల. ఆపదలో తోడుగా YSSR అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. తెలంగాణ ఆడబిడ్డలారా.. ధైర్యం కోల్పోకండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి .. మళ్ళి మీ జీవితం సాఫీగా సాగేందుకు..మీరంతా మన YSR కుటుంబసభ్యులుగా భావించి ..నా వంతుగా మీకు ఏదైనా సహాయం చేయాలనుకొంటున్నానని వెల్లడించారు షర్మిల.

ఆపదలో తోడుగా YSSR టీం ఫొన్ నంబరు 040-48213268 కు మీ సమాచారాన్ని తెలియజేయాలన్నారు. తమ కుటుంబాలకు ఆర్థిక అండగా నిలిచే ఎంతోమంది ఈ కరోనా బారిన పడి చనిపోయారు. వారందరికి తోడుగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు షర్మిల.

రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,20,709 కి చేరింది. కరోనాను కట్టడి చేసేందుకు పది రోజుల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.