శాతకర్ణి…తెలుగు జాతి విజయం

230
Recreating Gautamiputra Satakarni glory
- Advertisement -

గౌతమిపుత్ర శాతకర్ణి తెలుగు జాతి విజయమని నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రసాద్ ఐ మ్యాక్స్‌లో దర్శకుడు క్రిష్, హీరోయిన్ శ్రియా సరన్‌ అభిమానులతో కలిసి వీక్షించిన సినిమా విజయవంతం కావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సినిమాకు అద్భుత స్పందన వస్తోందని…గౌతమి పుత్ర శాతకర్ణి చేయటం నా పూర్వ జన్మ సకృతమని తెలిపారు.

అనుకున్న సమయంలో 79 రోజుల్లో సినిమాను పూర్తిచేశామన్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు కష్టపడి పనిచేశారన్నారు. దర్శకుడు క్రిష్…నిర్మాతలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులను అలరించేలా సినిమా రూపుదిద్దుకుందని తెలిపారు. అభిమానులను అలరించే అన్ని అంశాలు సినిమాలో ఉన్నాయని…రన్ టైమ్ కూడా తక్కువగా ఉందన్నారు.

భవిష్యత్‌లో మరిన్ని విజయవంతమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని బాలయ్య తెలిపారు. శాతకర్ణి సినిమాని ఆదరిస్తున్న అందరికి ధన్యవాదాలు తెలిపారు. మ‌న రాష్ట్రంలోని ప్రేక్ష‌కుల‌తో పాటు ఈ సినిమా విడుద‌లైన ప‌లు రాష్ట్రాల, విదేశాల ప్రేక్ష‌కులు కూడా ఈ సినిమాను ఎంత‌గానో ఆద‌రిస్తున్నాని ఆయ‌న అన్నారు. ఏదో క‌న‌ప‌డ‌ని అదృశ్య శ‌క్తులు ఈ సినిమాను న‌డిపించాయ‌ని తాను ఆనాడే చెప్పానని వ్యాఖ్యానించారు.

పంచ‌భ‌క్ష ప‌రమాన్నం అందించిన‌ట్లు సినిమాకు ప‌నిచేసిన బృందం ఈ సినిమాలో అన్నిటినీ క‌లిపారని బాలయ్య చెప్పారు. ఇది నాన్న‌గారు (ఎన్టీఆర్‌) చేయాల‌నుకున్న పాత్ర అని ఆ పాత్ర‌ను తాను చేయ‌డం త‌న‌ పూర్వ‌జ‌న్మ సుకృతంగా భావిస్తున్న‌ట్లు తెలిపారు.సినిమాను విజయవంతం చేసినందుకు థ్యాంక్స్ చెప్పింది హీరోయిన్ శ్రియ. గౌతమిపుత్ర శాతకర్ణి తెలుగు జాతి సినిమా అన్న క్రిష్‌…ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -