సాయిధరమ్‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్‌..

91

బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. డప్పులతో, పాలాభిషేకాలతో ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర హంగామా చేస్తున్నారు. సినిమాకు హిట్ టాక్ రావటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. తాజాగా మెగా కాంపౌండ్‌ నుంచి ఓ హీరో బాలయ్యపై ప్రశంసలు గుప్పించాడు.

‘‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి గొప్ప స్పందన వస్తోందని విన్నాను. దర్శకుడు క్రిష్‌కు, మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు. నందమూరి బాలకృష్ణ గారు మాలో చాలా మందికి స్ఫూర్తి’ ట్వీట్‌ చేశారు. అయితే, ఇప్పుడు ఈ ట్విటే అభిమానుల కోపానికి కారణమైంది. దీంతో సుప్రీమ్‌ హీరోపై ఫ్యాన్స్‌ తీవ్ర స్ధాయిలో మండిపడుతున్నారు.

Mega fans fire on Sai Dharam tej

కొంతమందైతే రాయలేని పదజాలం ఉపయోగించి కామెంట్లను పోస్టు చేస్తున్నారు. ‘ఇక చాలు ఊరుకో.. మన సినిమాకి ఆ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు కాని, నువ్వు అభినందనలు చెపుతావా..’ అని ఒకరు, ‘నువ్వెంత పొగిడినా నీ సినిమాకి వారి అభిమానులు రారు’ అని మరొకరు ట్వీట్లతో తిట్టి పోస్తున్నారు. ఇదిఇలా ఉండగా నందమూరి హీరో కల్యాణ్ రామ్, మెగా హీరో సాయిధరం తేజ్ కలసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తుండటం కొసమెరుపు.

ఇక ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విడుదల సందర్భంగా అక్కినేని నాగార్జున, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, కల్యాణ్‌రామ్‌, మంచు మనోజ్‌ తదితరులు ట్విట్టర్‌ వేదికగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. వీరందరికీ దర్శకుడు క్రిష్‌ ధన్యవాదాలు చెప్పారు.

Mega fans fire on Sai Dharam tej