బాలయ్య కు వర్మ సెల్యూట్‌..

92
Varma

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మళ్లీ తన ట్వీట్టర్ కు పని చెప్పాడు. అయితే ఈసారి మెగాఫ్యామిలీకి సంబంధించి కాకుండా..బాలయ్య 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి  చిత్రంపై వర్మ ప్రశంసల జల్లు కురిపించారు. తన తీర్పు నిజం కావడం చాలా థ్రిల్‌గా ఉందన్నారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో ఆయన అభినందనలు తెలిపారు.శాతకర్ణి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ గర్వించ దగ్గ స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. అరువు తెచ్చుకున్న కథతో కాకుండా యదార్థ కథతో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఆకాశానికి తీసుకెళ్లారని ఇందుకు దర్శకుడు క్రిష్‌, బాలయ్యకు తాను సెల్యూట్‌ చేస్తున్నట్లు చెప్పారు. దర్శకుడు క్రిష్‌కు, బాలయ్యకు 100 చీర్స్‌ అని ట్వీట్‌ చేశారు.

బాలకృష్ణ 100వ చిత్రం 150 సార్లు గొప్ప చిత్రంగా నిలిచిందనే అర్థంతో వర్మ ట్వీట్‌ చేశారు. నాగబాబు వర్మను అక్కు పక్షి అన్న దగ్గర్నుంచి పూర్తి యాంటీగా మారాడని, దాన్ని దృష్టిలో పెట్టుకునే ఓ వైపు బాలయ్య శాతకర్ణి సినిమాను పొగుడుతూనే..మరో వైపు చిరు సినిమాను విమర్శించాడని నేటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇక బాలయ్య నటించిన చారిత్రాత్మక చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటీవ్ టాక్‌ను సొంతం చేసుకుంది. గొప్ప ప్రయోగాత్మక సినిమాగా శాతకర్ణికి ప్రశంసల జల్లు కురిస్తోంది. సినీ ప్రముఖుల నుంచి కూడా బాలయ్య, క్రిష్‌కు అభినందలు వెల్లువెత్తున్నాయి.

మెగా సినిమాను, మెగా హీరోలను, మెగా అభిమానులను మరోసారి టార్గెట్ చేశాడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తెలుగు సినీ ఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా తీసుకెళ్లిందని వర్మ ప్రశంసించాడు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడం ‘బాహుబలి’ ప్రారంభిస్తే… దాన్ని ‘శాతకర్ణి’ మరింత ముందుకు తీసుకెళ్లిందని ట్వీట్ చేశారు. ఇప్పటికైనా విషయాన్ని ‘మెగా’ ప్రజలు అర్థం చేసుకోకపోతే… చివరకు వాళ్లు అల్పులుగా మిగిలిపోతారంటూ కామెంట్ చేశారు. ‘మెగా ప్రజలు’ అంటే మెగా హీరోలా లేక మెగా అభిమానులా అనే విషయాన్ని జనాలకే వదిలేశాడు వర్మ.