దూసుకుపోతున్న దువ్వాడ..

289
Record Collections For DJ On Day 1
- Advertisement -

వరుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న అల్లు అర్జున్.. తాజా చిత్రంగా ‘దువ్వాడ జగన్నాథం’ నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న ఏ థియేటర్ దగ్గర చూసినా బన్నీ అభిమానుల సందడి ఒక రేంజ్ లో కనిపించింది. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. బన్నీ కెరియర్ లోనే ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. ఇక ఓవర్సీస్ లోను ‘దువ్వాడ’ దూకుడు తక్కువగా లేదు. గురువారం రోజున ప్రీమియర్ షోల ద్వారా 350000 డాలర్ల గ్రాస్ ను రాబట్టింది. ఇక శుక్రవారం రోజున 180000 డాలర్లను వసూలు చేసింది.

Record Collections For DJ On Day 1

అయితే ఈ శని, ఆదివారాల్లో వసూళ్లు మరింతగా పెరగడం ఖాయమని చెబుతున్నారు. దగ్గర్లో బన్నీ స్థాయి హీరోల సినిమాలేవీ లేకపోవడంతో, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దూకుడును ఆపడం కష్టమేనని అంటున్నారు. కథ కథనాలు బన్నీ డిఫరెంట్ లుక్స్ పూజా హెగ్డే గ్లామర్ ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు తెచ్చిపెడుతున్నాయని అంటున్నారు. అంతే కాకుండా తెలుగు సినిమా క్లైమాక్స్‌లు భారీ స్థాయిలో ఉంటాయి.కాని ఈ సినిమాలో కొత్త క్లైమాక్స్‌ను ట్రై చేశారు. సాధారణ కమర్షియల్‌ సినిమాల క్లైమాక్స్‌లతో పోల్చుకుంటే ఇది కొత్తగానే ఉందట.

మరి అప్పటివరకు పవర్‌ఫుల్‌గా సాగిన సినిమాకు కామెడీ ఎండింగ్‌ ఇచ్చాడు హరీష్‌ శంకర్‌. కొంత మంది ఈ క్లైమాక్స్‌ కొత్తగా ఉందంటుంటే, మరికొంత మంది చప్పగా ఉందని ఫీలవుతున్నారు. నిజానికి ఈ వెరైటీ క్లైమాక్స్‌ కోసం ప్రేక్షకులను మెంటల్‌గా ప్రిపేర్‌ చేసేందుకే హరీష్‌ శంకర్‌ పదేపదే క్లైమాక్స్‌ గురించి మాట్లాడాడని అర్థమవుతోంది. అన్నట్టు, ఈ క్లైమాక్స్‌ విషయంలో బన్నీకూడా చాలా హెల్ప్‌ చేశాడని, ఆయన సలహాతోనే క్లైమాక్స్‌ ఇలా వచ్చిందని కూడా దర్శకుడు ఓ సందర్బంలో చెప్పాడు.

- Advertisement -