మోహన్ బాబు దర్శకత్వంలో విష్ణు..!

255
Manchu Vishnu in Mohan Babu 'Kannappa'
- Advertisement -

విలన్ గా చిత్ర రంగ ప్రవేశం చేసి … హీరోగా మారి .. వందలాది చిత్రాలలో తనదైన నటనను కనబర్చి ప్రేక్షకులను అలరించిన హీరో మోహన్ బాబు. విలక్షణ నటుడిగా కలెక్షన్‌ కింగ్‌గా ప్రేక్షకుల మనసులను దోచుకున్న మోహన్ బాబు నిర్మాతగా కొన్ని సినిమాలను సైతం తెరకెక్కించాడు. తాజాగా కలెక్షన్ కింగ్ మెగా ఫోన్ పట్టబోతున్నారట..? స్టార్ట్ యాక్షన్ కెమెరా అంటూ సరికొత్త అవతారం ఎత్తబోతున్నారట. ఇప్పుడు ఇదే ఫిల్మ్‌ నగర్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Manchu Vishnu in Mohan Babu 'Kannappa'
గతంలో మోహన్ బాబు తనయుడు విష్ణు ‘కన్నప్ప’ చిత్రాన్ని నిర్మించడానికి స్క్రిప్టును సిద్ధం చేసుకున్నాడు. అయితే, దీనిని డీల్ చేయగల సరైన  దర్శకుడు దొరకక ఆయన ఆ ప్రాజక్టును హోల్డ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ కన్నప్ప చిత్రానికి మోహన్ బాబు దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో హీరో కన్నప్ప పాత్రలో విష్ణు, శివుడి పాత్రలో మోహన్ బాబు నటిస్తారట.

మిథునం త‌ర‌వాత‌… క‌న్న‌ప్ప క‌థ‌ని వెండి తెర‌కెక్కించాల‌ని భావించారు త‌నికెళ్ల భ‌ర‌ణి. ముందు సునీల్‌ని హీరో అనుకొన్నారు. ఆ త‌ర‌వాత విష్ణు చేతికి చేరింది. ఈ క‌థ‌ని ఇప్పుడు బుర్రా సాయిమాధ‌వ్ చేతిలో పెట్టార‌ని టాక్‌. భ‌ర‌ణి రాసిన సంభాష‌ణ‌ల్ని బుర్రా తిర‌గ రాస్తున్నాడ‌ని తెలుస్తోంది. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు, కంచె, గౌత‌మిపుత్ర లాంటి సినిమాల‌కు ప‌దునైన సంభాష‌ణ‌లు అందించారు బుర్రా. ఆ న‌మ్మ‌కంతోనే.. మోహ‌న్ బాబు బుర్రా చేతికి ఈ క‌థ‌ని అంద‌జేశార‌ని తెలుస్తోంది. 2018లో క‌న్న‌ప్ప సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశాలున్నాయి.

- Advertisement -