అమ్మాయి ఊ అంటే చాలు… ఇప్పుడు ఇదే ట్రెండ్!

217
- Advertisement -

పెళ్లి కానీ ప్రసాద్… ఈ డైలాగ్ వింటే చాలు ప్రస్తుతం సమాజంలో పెళ్లి కోసం యువకులు పడుతున్న బాధ గుర్తుకొస్తుంది. జీవితాంతం పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేసిన తరువాత పెళ్లి చేస్తే ఓ పనైపోతుందనుకునే ట్రెండ్ నుండి ప్రస్తుం పెళ్లి అయితే చాలు అనే పరిస్థితి వచ్చింది.

ఒకప్పుడు ఉద్యోగం ఉంటే చాలు వెనుక ముందు చూడకుండా అమ్మాయిని ఇచ్చి వివాహం చేసేవారు. అంతేగాదు వారడిగే గొంతమ్మ కొరికలు తీర్చి అమ్మాయిని అత్తగారింటికి పంపేవారు. ఇదే ట్రెండ్ చాలాకాలం వరకు కొనసాగింది. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్‌. కులం, మతం అనే తేడాలేదు. పెళ్లి కానీ ప్రసాద్‌ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. 6 అంకెల జీతం ఉన్న అమ్మాయి దొరకని పరిస్థితి. దీంతో కట్నం సంగతి పక్కన పెడితే అమ్మాయి అయితే చాలు అవసరమైతే ఎదురుకట్నం ఇచ్చి వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరికొంతమందైతే కులాల సంగతి కూడా పట్టించుకోవడం లేదు. దీనిని భట్టి అర్ధం చేసుకోవచ్చు పెళ్లికానీ ప్రసాద్‌ల పరిస్థితి ఏవిధంగా ఉందో.

ఈ నేపథ్యంలో గతంలో నేటి పరిస్థితులను చమత్కరిస్తూ చేసిన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 1985లో పెళ్లి కొడుకు రేడియో అడిగేవారట తర్వాత 1995లో పెళ్లికొడుకు సైకిల్ అడిగేవారట, ఇక 2005లో పెళ్లి కొడుకు మోటర్ సైకిల్ అడిగేవారట, ఇక 2015లో పెళ్లికొడుకు కారు అడిగేవారని కానీ ప్రస్తుతం పెళ్లి కొడుకు అమ్మాయి అయితే చాలు..మిగితావి నేను సంపాదించుకుంటా అనే పరిస్థితి వచ్చిందనే మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బ్యాచ్‌లర్ బాబుల కష్టాలు అంతా ఇంత కాదు. ముఖ్యంగా ఉద్యోగం చేసే చోటు దగ్గరి నుండి నివాసం ఉండేందుకు కనీసం రూం దొరకని పరిస్థితి నెలకొంది. ఊరిలో ఎకరాల పొలం ఉన్నా వేలు సంపాదించే ఉద్యోగం ఉన్నా పిల్లనివ్వటానికి ముందుకు రానీ ఆడపిల్ల తల్లిదండ్రులు.ఊళ్లో ఎకరాల మాట దేవుడెరుగు నెత్తిమీద ఎకరాల కెకరాలు పోతూ బట్టతల ఐతున్నా ఇంకా పెళ్లి అవుతలేదని భాదపడుతున్న ముదురు బ్యాచ్ లర్ లు ఎందరో…దీంతో ఇప్పుడు పిల్లలకు పెళ్లిళ్లు చేయడమే తల్లిదండ్రులకు ఓ సవాల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -