జుట్టు రాలుతోందా..ఈ సమస్యలే కారణం!

43
- Advertisement -

నేటి రోజుల్లో జుట్టు రాలిపోవడం అనేది సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పురుషుల్లో ఈ జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. 20 ఏళ్ళు కూడా నిండని వారు బట్టనెత్తితో బాధపడుతూ మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. అసలు ఈ జుట్టు రాలే సమస్యే ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఎందుకు వస్తోందనే దానికి చాలానే కారణాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. కొందరిలో ఈ జుట్టు రాలే సమస్య వంశపారపర్యంగా కూడా సంక్రమితుందట. అయితే చాలా మందిలో ఈ సమస్య కనిపించడానికి ప్రధాన కారణం.. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు. .

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పురుషులు తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. తద్వారా ఆ ప్రభావం జుట్టుపై అధికంగా ఉంటుంది. అతి ఆలోచనలే జుట్టు రాలడానికి ప్రధాన కారణం అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మానసిక ప్రశాంతత జుట్టు పెరుగుదలకు ఎంతో ముఖ్యం. అందువల్ల ఉదయాన్నే యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఉండాలి. ఇక మనం తినే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం కూడా జుట్టు రాలడానికి మరో కారణం.

విటమిన్ సి, ఐరన్ వంటి పోషకాలు లోపిస్తే జుట్టు రాలుతుంది. కాబట్టి మనం తినే ఆహారంలో వీటి శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు.. వంటి వాటిలో అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజూ కూరగాయలు తినే అలవాటు చేసుకోవాలి. మరి ముఖ్యంగా క్యారెట్, బీట్ రూట్, ఎక్కువగా తినాలి. ఇందులో విటమిన్ సి తో పాటు ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇంకా ద్రాక్ష, ఆరెంజ్, ఉసిరి, జామ.. ఇవన్నీ కూడా రెగ్యులర్ ఆహార డైట్ లో చేర్చుకోవాలి. తద్వారా జుట్టు రాలే సమస్యను కొంతవరకు అరికట్టవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read:‘కుబేర’…నాగార్జున ఫస్ట్ లుక్

- Advertisement -