Rishabh Pant:ఇకపై ఆదాయంలో 10 శాతం పేదలకే

26
- Advertisement -

టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ మంచి మనసు చాటుకున్నాడు. ఇకపై తనకు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంలో 10 శాతం పేదలకు ఆర్ధిక సాయం చేస్తానని ప్రకటించాడు. రిషబ్ పంత్ ఫౌండేషన్ ద్వారా పేదలకు సాయం చేస్తానని ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ఎక్స్ వేదికగా తెలిపాడు.

క్రికెట్ వల్లనే ఈ స్థాయికి చేరుకున్నాను అని తెలిపాడు. క్రికెట్ తనకు అందించిన దానికి కృతజ్ఞతగా, సమాజానికి తిరిగి అందించాలనే ఆలోచన నా మనసులో ఉందని చెప్పాడు. 2017లో టీమిండియాకు ఆరంగేట్రం చేశాడు పంత్.

గత ఏడాది టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవగా జట్టులో పంత్ కూడా ఓ సభ్యుడు. ఐపీఎల్ 2025 వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన క్రికెటర్‌గా పంత్ రికార్డు సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ని ఏకంగా రూ. 27 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

Also Read:‘తండేల్’ నా కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ!

- Advertisement -