పంచాయతీల్లోనూ పడకేసిన పాలన!

10
- Advertisement -

రాష్ట్ర సచివాలయంలోనే కాదు.. చివరికి…గ్రామ సచివాలయాల్లో కూడా పాలన పడకేసిందని దుయ్యబట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. గాడితప్పిన పంచాయతీల్లో పరిపాలన సాగేదెట్లా..? సమస్యల సుడిగుండంలో ఉన్న ప్రజల కష్టాలు తీరేదెట్లా..?? అని ప్రశ్నించారు.

పడకేసిన పారిశుధ్యంతో ప్రజలు రోగాలపాలు.. వీధి దీపాలు వెలగక పల్లెసీమల్లో చిమ్మ చీకట్లు అలుముకున్నాయన్నారు. దెబ్బతిన్న రోడ్లను రిపేర్ చేయడానికి పైసల్లేవు.. పంచాయతీ ట్రాక్టర్ కు డీజిల్ పోసే దిక్కు లేదు అన్నారు. ఇదేనా ప్రజాపాలనా.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం..ప్రత్యేకాధికారుల పాలనకు ఏడాదైనా కళ్లుతెరవరా..? చెప్పాలన్నారు.

బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతితో మారిన రుపురేఖలు.. నాడు పంచాయతీలకు ఠంచన్ గా కడుపునిండా నిధులు, కాంగ్రెస్ వచ్చింది.. మళ్లీ పల్లె ప్రజలకు పాత కష్టాలు తెచ్చిందన్నారు. నిన్నటి దాకా పెండింగ్ బిల్లులు రాక మాజీ సర్పంచ్ లు అప్పులపాలు … నేడు జేబుల నుంచి ఖర్చుచేసిన కార్యదర్శులకు తప్పని తిప్పలు ముఖ్యమంత్రి ఇకనైనా మొద్దునిద్ర వీడాలి..గ్రామాల్లో సమస్యల పంచాయతీని తీర్చాలని డిమాండ్ చేశారు.

Also Read:తెలంగాణకు 4 టీఎంసీల నీటి విడుదల

- Advertisement -