- Advertisement -
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు కేవలం 10 శాతమే పోలింగ్ నమోదుకాగా చిన్నపోరపాటు కారణంగా ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో పోలింగ్‌ను రద్దు చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం.
26వ డివిజన్ అయిన ఓల్డ్ మలక్‌పేట్‌లో కంకి కొడవలి (సీపీఐ)కి బదులుగా… సుత్తి కొడవలి (సీపీఎం) గుర్తులను ముద్రించడంతో ఈసీకి ఫిర్యాదుచేసింది సీపీఐ. దీంతో స్పందించిన ఈసీ ఎన్నికలు రద్దు చేస్తూ రేపు ఓల్డ్ మలక్ పేట డివిజన్లలోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్.
- Advertisement -