రానా ‘విరాట‌ప‌ర్వం’ షూటింగ్ పునఃప్రారంభం

71
rana

రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘విరాటప‌ర్వం’. ‘నీది నాది ఒకే క‌థ’ ఫేమ్ వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం హిస్తోన్న ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు స‌మ‌ర్పిస్తుండ‌గా, శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ఒక చిన్న షెడ్యూల్ మిన‌హా ‘విరాట‌ప‌ర్వం’ షూటింగ్ దాదాపుగా పూర్త‌యింది. మిగిలిన పోర్ష‌న్‌కు సంబంధించి ఇటీవ‌లే షూటింగ్ పునఃప్రారంభ‌మైంది. రాత్రిపూట స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో రానా కూడా పాల్గొంటున్నారు.

ఒక విభిన్న త‌ర‌హాతో, కంటెంట్ ప్ర‌ధానంగా రూపొందుతున్న ‘విరాట‌ప‌ర్వం’లో ఇప్ప‌టివ‌ర‌కూ తాము పోషించ‌ని త‌ర‌హా పాత్ర‌ల‌ను రానా, సాయిప‌ల్ల‌వి పోషిస్తున్నారు.ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావు, సాయిచంద్ ముఖ్య పాత్ర‌ధారులైన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.

తారాగ‌ణం:
రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి, ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావు, సాయిచంద్, బెన‌ర్జీ, నాగినీడు, రాహుల్ రామ‌కృష్ణ‌, దేవీ ప్ర‌సాద్‌, ఆనంద్ ర‌వి, ఆనంద్ చ‌క్ర‌పాణి

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: వేణు ఊడుగుల‌
నిర్మాత‌: సుధాక‌ర్ చెరుకూరి
బ్యాన‌ర్‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్‌
స‌మ‌ర్ప‌ణ‌: డి. సురేష్ బాబు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్ కుమార్ చాగంటి
సినిమాటోగ్ర‌ఫీ: డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాక‌ర్ మ‌ణి
మ్యూజిక్‌: సురేష్ బొబ్బిలి
ఎడిటింగ్‌: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: శ్రీ‌నాగేంద్ర‌
స్టంట్స్‌: స్టీఫెన్ రిచ‌ర్డ్‌, పీట‌ర్ హెయిన్‌
కొరియోగ్ర‌ఫీ: రాజు సుంద‌రం
పీఆర్వో: వంశీ-శేఖ‌ర్‌