ఎమ్మెల్యే నోముల మృతి పార్టీకి తీరనిలోటు:కేటీఆర్

97
ktr

ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పార్టీకి తీరని లోటన్నారు మంత్రి కేటీఆర్. కొత్తపేటలోని నోముల నర్సింహయ్య భౌతిక కాయానికి నివాళి అర్పించిన కేటీఆర్…కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నోముల నర్సింహయ్య వివాదరహితుడని …కేసీఆర్‌ పిలుపుమేరకు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని చెప్పారు. నోముల రాజకీయ జీవితమంతా ప్రజా పోరాటాలతోనే కొనసాగిందని …ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి ప్రార్థించారు.

ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు భౌతిక కాయానికి మంత్రి నిరంజన్‌ రెడ్డి నివాళులర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మంత్రులు జగదీష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, రైతుబంధు సమితి చైర్మన్‌ పల్లారాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌, చిరుమర్తి లింగయ్య, భూపాల్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, పార్టీ నేత కర్నెప్రభాకర్‌ నోముల భౌతికకాయానికి నివాళులర్పించారు.