అమ్మ రాజశేఖర్‌కు అరగుండు చేసిన నోయ‌ల్..

44
AmmaRajasekhar

తెలుగులో బిగ్ బాస్ 4 రోజురోజుకీ టాస్కులు మరీ పెరిగిపోతున్నాయి. ఒక్కోసారి పెద్దాయన ఇచ్చే టాస్కులు చూసి అక్కడున్న వాళ్లే కాదు బయట ప్రేక్షకులు కూడా భయపడుతున్నారు. వామ్మో ఏంటీ టాస్కులు.. కెప్టెన్సీ కోసం.. లగ్జరీ బడ్జెట్ కోసం మరీ ఇంతగా చేయాలా అనిపిస్తుంది. మొన్నటికి మొన్న ఓ టాస్కులో భాగంగా డీల్ అంటూ ఒంటిపై బట్టలన్నీ విప్పించేసాడు బిగ్ బాస్. దాంతో పాటు హారిక జుట్టు కూడా కట్ చేసుకుంది. అభిజీత్ తన బట్టలతో పాటు అన్నీ ఇచ్చేసాడు. ఇలా ఒక్కో టాస్క్ మరీ హై రేంజ్‌కు చేరిపోతుంది. అందులో భాగంగానే ఓ డీల్‌లో ఏకంగా అరగుండు కొట్టించుకోవాలి. దానికి ఎవరూ ఒప్పుకోలేదు కూడా. ఇంట్లో ఉన్న ఎవరో ఒక మగ కంటెస్టెంట్ సగం గుండుతో పాటు మీసాలు కూడా సగం చేయించుకోవాలి.

దానికి నోయల్, అఖిల్, అభిజీత్ సహా ఎవరూ ఒప్పుకోలేదు. కానీ అమ్మ రాజశేఖర్ ముందుకొచ్చాడు. మళ్లీ ఆ తర్వాత డీల్ ఒప్పుకోలేదు. బిగ్ బాస్‌కు డీల్ ఇచ్చి ఒప్పుకోకపోవడంతో మరోసారి నాగ్ అదే డీల్ వీకెండ్‌లో తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎవరైనా అలా చేస్తే నెక్ట్స్ వీక్ నామినేషన్స్ లేకుండా చేస్తానంటూ మాటిచ్చాడు. దానికి ఇంటి కెప్టెన్ అయిన నోయల్‌తో పాటు అఖిల్, అభి, కుమార్ సాయి అంతా సైలెంట్‌గా ఉన్నారు. కానీ అమ్మ రాజశేఖర్ మాత్రం ముందుకొచ్చాడు. కెప్టెన్ నోయ‌ల్ స్టోర్ రూంలో ఉన్న ట్రిమ్మ‌ర్‌ను తీసుకొచ్చి మాస్టార్‌కు అర‌గుండు చేశారు. దీంతో అంతా షాక్ అయ్యారు. దివి నో అని చెప్పొచ్చు క‌దా మాస్టారు అంటూ ఏడ్చేసింది. తాజాగా విడుద‌లైన ప్రోమో ప్రేక్ష‌కుల‌లో చాలా ఆస‌క్తిని క‌లిగించింది.

Next nomination safe avataniki deal accept chesina #AmmaRajasekhar #BiggBossTelugu4 today at 9 PM