రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని (Code of Conduct) ఉల్లంఘించినందుకు ఐపీఎల్ కమిటీ ఆయనపై చర్యలు తీసుకుంది.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆండీ ఫ్లవర్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.20 కింద ‘లెవల్ 1’ నేరానికి పాల్పడినట్లు తేలింది. ఈ ఉల్లంఘనకు గానూ ఆయన మ్యాచ్ ఫీజులో కొంత శాతాన్ని జరిమానాగా విధించారు. నిబంధనల ప్రకారం ఆయన తన తప్పును అంగీకరించారు.
మైదానంలో అంపైర్ల నిర్ణయాల పట్ల అసహనం వ్యక్తం చేయడం లేదా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం వల్ల ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read:BRS:రేపు కేసీఆర్ అధ్యక్షతన సమావేశం
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న తరుణంలో, ఆటగాళ్లకే కాకుండా కోచ్‌లకు కూడా నిబంధనలు వర్తిస్తాయని ఈ ఘటన ద్వారా ఐపీఎల్ స్పష్టం చేసింది. లెవల్ 1 ఉల్లంఘనల విషయంలో మ్యాచ్ రెఫరీ నిర్ణయమే అంతిమంగా ఉంటుంది.

