ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజీనామా..

275
viral-acharya
- Advertisement -

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య, అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. తన పదవి విరమణకు ఇంకా ఆరు నెలల ముందే రాజనామా చేయడం చర్చాంశనీయంగా మారింది.2017, జనవరి 23 ఆయన్ను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా కేంద్రం నియమించింది.

వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని తన రాజీనామా లేఖలో ఆయన వెల్లడించినట్టు తెలుస్తోంది. కాగా, ఆయన త్వరలోనే న్యూయార్క్ లోని స్టెర్న్ స్కూల్ లో ప్రొఫెసర్ గా బాధ్యతలను నిర్వర్తించనున్నారని సమాచారం.

- Advertisement -