144 కోట్ల జనాభా..ఎంతమంది ఇంటర్నెట్ వాడుతున్నారో తెలుసా?

46
- Advertisement -

ఇటీవలె 77 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. ఈ 77 ఏళ్లలో భారతదేశం ఎంతో ప్రగతిని సాధించింది. ఒకప్పుడు దేశం అభివృద్ధి చెందుతున్న దేశం..కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ అనేక రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. వ్యవసాయం, విద్యుత్తు, పరిశ్రమలు, ఐటీ.. ఇలా అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంది.ఓ వైపు అగ్రదేశాలతో పాటు దేశాలన్ని ఆర్ధికం సంక్షోభంలో కూరుకుపోతుంటే భారత్ మాత్రం వాటిని ధీటుగా ఎదుర్కొని ముందుకు సాగుతోంది.

మొబైల్,ఆటో మొబైల్,ఫార్మా,సోలార్,సెమీ కండక్టర్,ఎలక్ట్రానిక్స్,ఎలక్ట్రికల్,వస్త్ర పరిశ్రమ, ఏవియేషన్, కెమికల్స్,టెలికాం,ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించడంతో భారతదేశ ప్రగతి సాధ్యమైంది. దీంతో పాటు విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆకర్షించడం అలాగే మౌలిక సదుపాయాలైన రోడ్డు,రవాణా,రైల్వే,వాయు రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది.

ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారత దేశ జనాభా 144 కోట్లు ఉండగా ఇందులో ఆదార్ కార్డు ఉన్నవారు 136 కోట్ల మంది ఉన్నారు. దేశంలో 120 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతుండగా 114 కోట్ల మంది మొబైల్స్ వాడుతున్నారు. దేశంలో ఓటు హక్కు కలిగిన వారు 95 కోట్ల మంది ఉండగా ఈ కామర్స్ యూజర్స్ 80 కోట్లు, స్మార్ట్ ఫోన్ యూజర్స్ 65 కోట్ల మంది ఉన్నారు.

Also Read:సిలిండర్ ధరలపై ఎమ్మెల్సీ కవిత వ్యంగ్యాస్త్రం

ఇక దేశంలో ఓటీటీ సబ్‌స్క్రైబర్స్ 50 కోట్ల మంది ఉండగా సోషల్ మీడియా యూజర్స్ 40 కోట్ల మంది,యూపీఐ వాడుతున్న వారి సంఖ్య 30 కోట్లుగా ఉంది. ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫామ్ యూజర్స్ 28 కోట్లు,బీమ్ పేమెంట్ యూజర్స్ 20 కోట్ల మంది ఉన్నారు. దేశంలో పట్టణ జనాభా 37 శాతంగా ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 63 శాతం మంది ఉన్నారు. డిజిటల్ లెర్నింగ్ యూజర్స్ 9.3 కోట్ల మంది ఉండగా ఈ సంజీవని హెల్త్ కేర్ యూజర్స్ 9.2 కోట్ల మంది, హెల్త్ ఇన్సురెన్స్ యూజర్స్ 51.4 కోట్ల మంది ఉన్నారు. ఇక స్టాక్ మార్కెట్‌ యూజర్స్ 8 కోట్ల మంది ఉండగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ 3.5 కోట్ల మంది ఉన్నట్లు ఆర్బీఐ గణంకాలను వెల్లడించింది.

భారతదేశంలో యువత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మరో 50 ఏళ్ల వరకు ఇదే ట్రెండ్ కొనసాగుతుందని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం జనాభాలో 25 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు 40 శాతానికి పైనే ఉన్నారు. సగం జనాభా 25-64 వయసుల మధ్యలో ఉన్నప్పటికీ మధ్యస్థ (మీడియన్) వయసు 28 సంవత్సరాలు. భారత్‌లో వృద్ధుల (65 పైబడినవారి) సంఖ్య చాలా తక్కువగా ఉంది. మొత్తం జనాభాలో కేవలం 7 శాతం వృద్ధులు ఉన్నారు.

Also Read:టైమ్ చూసి బీజేపీతో దోస్తీ..బాబు ప్లాన్?

- Advertisement -