- Advertisement -
ఆర్బీఐ ద్రవ్య పరమతి విధాన సమీక్షలో భాగంగా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది ఆర్బీఐ. ఈ మేరకు వివరాలను వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. ప్రస్తుతం ఉన్న రెపో, రివర్స్ రెపోలో ఎలాంటి మార్పు చేయలేదన్నారు.
సెప్టెంబర్‌లో కూడా ద్రవ్యోల్బణం అధికంగా ఉంటుందని, ఆ తర్వాత క్రమంగా మూడవ, నాల్గవ త్రైమాసికంలో తగ్గుతుందని అంచనా వేశామని అన్నారు. మార్కెట్ ఒడిదిడుకులు ఎదుర్కొనేందుకు ఆర్బీఐ సంసిద్ధంగా ఉందని వెల్లడించారు.
మూడో త్రైమాసికంలో ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నట్లు కనిపిస్తున్నాయని….2021 సంవత్సరానికి జీడీపీ 9.5 శాతం తగ్గనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ అంచనా వేశారు. స్వదేశీ లావాదేవీలను వేగంగా నిర్వహించేందుకు ఈ ఏడాది డిసెంబర్ నుంచి రోజంతా ఆర్టీజీఎస్ సేవలను అందించనున్నట్లు తెలిపారు.
- Advertisement -