కమలా హ్యారిస్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు…

257
donald trump

కరోనా నుండి కోలుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తిరిగి ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. తాజాగా ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డెమోక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హ్యారిస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. డెమోక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆయన నుంచి నెల రోజుల్లోనే కమలా హ్యారిస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంటారని ఆరోపించారు.

అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థులు మైక్ పెన్స్, కమలా హ్యారిస్‌లు మధ్య ఎన్నికల డిబేట్ జరిగిన అనంతరం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆమె కమ్యూనిస్ట్… సోషలిస్ట్ కాదు.. అంతకు మించి.. ఆమె అభిప్రాయాలను పరిశీలిస్తే హంతకులు, రేపిస్టులు దేశం నుంచి పారిపోవడానికి సరిహద్దులను తెరవాలని ఆమె కోరుకుంటుందని మండిపడ్డారు.