రేపో రేటుపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన ఆయన రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 4.4 శాతం నుంచి 4 శాతానికి చేరుకున్నట్లు చెప్పారు.
కరోనా సంక్షోభ సమయంలో ఒక్క వ్యవసాయంపైనే ఆశలు పెట్టుకున్నట్లు శక్తికాంత్ తెలిపారు. రుతుపవనాలపై కేంద్ర వాతావరణశాఖ ఇస్తున్న సమాచారం వ్యవసాయం రంగంపై మరింత ఆశలను రేపుతున్నట్లు ఆయన చెప్పారు.
భారత్ ఆర్థికంగా మళ్లీ గాడిలో పడుతుందన్న విశ్వాసం కలిగి ఉండాలని శక్తికాంత్ దాస్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది వాణిజ్యం సుమారు 13 నుంచి 32 శాతానికి పడిపోయే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. కీలకమైన పరిశ్రమల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిందన్నారు. కూరగాయలు, నూనెదినుసులు, పాల ధరలు తారాస్థాయికి చేరినట్లు చెప్పారు.