సీఎం కేసీఆర్‌ ఆలోచన నుండి పుట్టిందే బస్తీ దవాఖానా..

303
minister talasani
- Advertisement -

సీఎం కేసీఆర్‌ ఆలోచన నుండి పుట్టందే బస్తీ దవాఖానా అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని చేపల బాయి, నాలా బజార్ లో ఆబిడ్స్ లోని జిఎచెంసి కమ్యూనిటీ హాల్ లో,గోడే కా కబర్ కామాటి పురా బస్తీ లోని జిఎచెంసి కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన లను ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ .

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి తలసాని..ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలో 123 బస్తీ దవాఖానలు ఉన్నాయని తెలిపారు. ఇవాళ కొత్తగా 45 బస్తీ ధవాఖానాలు ప్రారంభించామని…పేద ,మధ్య తరగతి ,మైనార్టీ ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నవాళ్లకు ఈ బస్తీ ధవాఖానాలు ఉపయోగపడతాయని చెప్పారు.

రాబోవు కాలంలో 1000 బస్తి ధవాఖానాలు ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అన్నారు. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తమ పరిసరాలను శుభ్రపరచుకోవాలి అప్పుడే ఎలాంటి వ్యాధులు సంక్రమించవన్నారు. బస్తి దవాఖాన లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి.అన్ని టెస్టులు చేసి మెడిసిన్ ఇస్తారు ప్రజలు దీన్ని వినియోగించుకోవాలన్నారు తలసాని.

- Advertisement -