పాక్ మాజీ క్రికెటర్‌తో తమన్నా పెళ్లి..!

229
Razzaq-Tamanna Bhatia Relationship Sparks
- Advertisement -

అందం, నృత్యం, అభినయంతో తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాల్లో కలల సుందరిగా స్థిరపడిపోయిన తమన్నా, హిందీ చిత్రసీమలోనూ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ బ్యూటీకి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

మిల్క్ బ్యూటీ  త్వరలోనే పెళ్ళి చేసుకోనుందని అది…ఓ పాక్ మాజీ క్రికెటర్‌ని అని సోషల్ మీడియా కోడై కూస్తోంది.వీరిద్దరూ  కలిసి దిగిన  ఫోటో బయటికి రావడంతో  ఈ దూమారం చెలరేగింది.

అయితే ఈ ఫోటో వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే ఈ ఫోటో 2013 సంవత్సరంది కాగా, అప్పట్లో దుబాయ్ లోని ఓ షాప్ ఓపెనింగ్ కి తమన్నా, రజాక్ వెళ్ళారు. అప్పుడు క్లిక్ చేసిందే ఈ ఫోటో. ఇప్పుడు ఈ పిక్ ని వైరల్ గా మార్చి తమన్నా పెళ్లి పీటలెక్కనుందని రూమర్స్ పుట్టించారు.

తమన్నా గతంలో ఓ ఇంజనీర్ ని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు రాగా, నా జీవితంలోకి ఎవరైన అడుగు పెడితే నేనే మొదట మీ అందరికి చెబుతాను అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.ఈ అమ్మడు సినిమాల విషయానికి వస్తే పలు తమిళ సినిమాలతో బిజీగా ఉన్న తమ్మూ, జై లవకుశ లో ఓ ఐటెం సాంగ్ చేయనున్నట్టు సమాచారం.

- Advertisement -