రాజా ది గ్రేట్‌లో రవితేజ వారసుడు..

264
Ravi Teja Son Entry In Tollywood
- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది వారసులే తెరపై సందడి చేస్తూ ఉంటారు. ఇప్పటి స్టార్ హీరోల్లో చాలా మంది వారే. మన పరిశ్రమలోనే కాదు.. దేశవ్యాప్తంగా సినిమా రంగాల్లో ఇదే కల్చర్ కనిపిస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ వారసులందరూ హీరోలు అయిపోలేరు అన్నది జగమెరిగిన సత్యమే. వాళ్లకూ ట్యాలెంట్ ఉండి.. ప్రూవ్ చేసుకుంటే మాత్రమే నిలదొక్కుకోగలుగుతారు. అయితే ఇప్పుడు మరో వారసుడు వచ్చేస్తున్నాడు. అతనెవరో కాదు.. మాస్‌ మహా రాజా రవితేజ కుమారుడు మహాధన్.

Ravi Teja Son Entry In Tollywood

‘బెంగాల్ టైగర్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన స్టార్ హీరో రవితేజ మధ్యలో కొంత గ్యాప్ తీస్కుని వరుసగా ‘రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు’ అనే రెండు సినిమాలు చేస్తున్నారు. వీటిలో ‘రాజా ది గ్రేట్’ అన్ని పనులు పూర్తిచేసుకుని అక్టోబర్ 12న రిలీజయ్యేందుకు రెడీ అవుతోంది. ఇకపోతే ఈ సినిమాతో రవితేజ కుమారుడు మహాధన్‌ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.

Ravi Teja Son Entry In Tollywood

ఈ సినిమాలో మహాధన్ చిన్నప్పటి రవితేజగా కనిపించనున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి, దిల్ రాజులు కలిసి మహాధన అయితే రవితేజ చిన్ననాటి పాత్రను చేయడానికి సరిపోతాడని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ చూపులేని వ్యక్తిగా కనిపించనున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ నెలకొంది.

- Advertisement -