యాక్షన్‌ మోడ్‌లో చిరు ‘విశ్వంభర’

11
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మాగ్నమ్ ఓపస్ విశ్వంభర. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బ్లాక్‌బస్టర్ ‘బింబిసార’ను అందించిన తర్వాత వశిష్ట, మెగాస్టార్ చిరంజీవిని దర్శకత్వం వహించే అవకాశాన్ని అందుకున్నారు. ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ మెగాస్టార్‌ను లార్జర్ దెన్ లైఫ్ పాత్రలో ప్రెజెంట్ చేయడానికి హ్యుజ్ స్పాన్ వున్న కథను సిద్ధం చేశాడు. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ కథానాయిక. ఇటీవలే కొన్ని టాకీ పార్ట్‌లు, ఒక పాట, ఒక యాక్షన్ బ్లాక్‌ని చిత్రీకరించిన షెడ్యూల్‌ను ముగించిన మేకర్స్, హైదరాబాద్‌లో కీలకమైన యాక్షన్ షెడ్యూల్‌ను ప్రారంభించారు.

ఫైట్ మాస్టర్స్ ద్వయం రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో హైదరాబాద్‌లోని అల్లుమియం ఫ్యాక్టరీలో చిరంజీవి, కొంతమంది ఫైటర్స్‌పై ప్రస్తుతం హై-ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌ను గ్రాండ్ స్కేల్ లో రూపొందిస్తున్నారు. కీలకమైన దశలో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు అడ్రినలిన్ రష్‌ని అందిస్తుంది.

విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్ రిచ్ ప్రొడక్షన్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో అద్భుతంగా వుండబోతోంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, శ్రీ శివశక్తి దత్తా, చంద్రబోస్ లిరిక్ రైటర్స్. విశ్వంభర 2025 సంక్రాంతికి జనవరి10న విడుదల కానుంది.

Also Read:పచ్చి కొబ్బరి తినడం మంచిదేనా?

- Advertisement -