నా బాధ మీకు అర్థం కాదు.. !

269
Raviteja reacts over his brother death
- Advertisement -

ఇటీవల ర‌వితేజ సోద‌రుడు భ‌ర‌త్ కారు యాక్సిడెంట్ లో మృతి చెందగా, ర‌వి తేజ త‌న‌ త‌మ్ముడిని క‌డ‌సారి చూసేందుకు కూడా వెళ్ళ‌లేదన్న సంగతి తెలిసిందే. అంతేకాదు భరత్‌ మరణించిన తర్వాతి రోజే రవితేజ తన సినిమా షూటింగ్‌కు హాజరైపోయాడు. ఈ విషయంలో ర‌వితేజ పై సోషల్ మీడియాలో తీవ్ర విమ‌ర్శ‌లు వచ్చాయి. ఇలాంటి రూమ‌ర్స్ మ‌ధ్య ర‌వితేజ అస‌లు విష‌యాన్ని చెప్పి ప్ర‌చారాల‌కు పులిస్టాప్ పెట్టాడు రవితేజ. తన తమ్ముడు భరత్ కారు ప్రమాదంలో మరణించిన వేళ, కనీసం అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదన్న నిందను మోయాల్సి రావడం తనకెంతో బాధను కలిగించిందని రవితేజ అన్నాడు. ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. తనకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని, ఇప్పుడు చెప్పేందుకు ఏమీ లేదని ఆయన అన్నాడు. తాము ఏ పరిస్థితిలో ఉన్నామో కూడా చూడకుండా, సామాజిక మాధ్యమాల్లో హిట్స్ కోసం రాద్ధాంతం చేశారని, ఎంతమాత్రమూ ఆలోచించకుండా నిందలు వేశారని అన్నాడు. ఆరోజు తన తండ్రి, తల్లి కుప్పకూలిపోయారని, వారు ఇప్పటికీ సాధారణ స్థితికి రాలేదని చెప్పుకొచ్చాడు. వారెక్కడ దూరమవుతారోనన్న ఆలోచన, ఛిద్రమైన భరత్ ముఖం చూడలేకే తాము వెళ్లలేదని మరోసారి స్పష్టం చేశాడు.

Bharath20170627

భ‌ర‌త్ చ‌నిపోయే నాలుగు రోజుల ముందు భ‌ర‌త్ బ‌ర్త్ డే వేడుక‌ల‌ని సెల‌బ్రేట్ చేసాము. ఎప్పుడు కేక్ క‌ట్ చేసేందుకు ఇష్ట‌ప‌డని భ‌ర‌త్ ఆ రోజు మాత్రం కేక్ క‌ట్ చేస్తా అని హ‌డావిడి చేశాడ‌ట‌. ఆ రోజు అందరం చాలా హ్య‌పీగా గ‌డిపాం. అదే రోజు నేను భ‌ర‌త్ ని క‌లిసిన చివ‌రి రోజు. ఆ క్ష‌ణాల‌నే ఎప్ప‌టికి గుర్తు పెట్టుకోవాల‌నుకుంటున్నాం. నా ఇద్ద‌రు పిల్ల‌లు భ‌ర‌త్ మ‌ర‌ణించిన వార్త విని వెక్కి వెక్కి ఏడ్చారన్నాడు. ఎప్పుడు ఎవ‌రికి ఎలాంటి అన్యాయం చేయ‌ని భ‌ర‌త్ ఈ రోజు మా మ‌ధ్య లేక‌పోవ‌డం చాలా బాధాక‌రం అంటూ ర‌వితేజ మ‌న‌సులోని బాధ‌ను బ‌య‌ట‌కు చెప్పాడు.

తమ్ముడి కర్మకాండలు అపరిచితులతో చేయించలేదని, తన తల్లి సోదరి భర్తతోనే చేయించామని, ఆయన ఎవరో తెలుసుకోకుండానే, భరత్ ను అనాధను చేశామని చెబుతూ తన కుటుంబాన్ని అవమానించారని వాపోయాడు. ఇక భరత్ మరణించిన రోజు షూటింగ్ లో ఎంతో మంది డేట్స్ ఉన్నాయని, ఇది కోట్ల వ్యాపారమని, ఒక్కరోజు తేడా జరిగినా నిర్మాత నష్టపోతాడన్న ఆలోచనతోనే బాధను మనసులోనే దిగమింగుకుని షూటింగ్ కు వెళ్లానని, దానిపైనా తనను ఎంతో మంది విమర్శించారని అన్నాడు. భరత్ పుట్టిన రోజున కలిశామని, ఆ రోజు మాట్లాడిన మాటలే ఆఖరు అయ్యాయని, ఔటర్ పై తన తమ్ముడి ప్రాణాల కోసమే లారీ బ్రేక్ డౌన్ అయినట్టు ఉందని తన మనసులోని బాధను వ్యక్తం చేశాడు. అస‌లు విష‌యాలు తెలుసుకోకుండా ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారాలు చేయ‌డం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్ అంటూ నెటిజ‌న్ల‌ని ప్ర‌శ్నించాడు ర‌వితేజ‌. మ‌రి ర‌వితేజ వివ‌ర‌ణ‌తో అయిన అలాంటి నెగెటివ్ ప్ర‌చారాల‌కు బ్రేక్ ప‌డుతుందో లేదో చూడాలి.

- Advertisement -