మారేడుమిల్లి అడవీలో రామారావు..

68
rt
- Advertisement -

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’.రవితేజ కెరీర్‌లో ఇది 68వ సినిమా కాగా ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, రవితేజ టీమ్‌ వర్క్స్‌ పతాకాలపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన లభించింది. ఈ చిత్రంలో రవితేజ పవర్‌ఫుల్‌ ప్రభుత్వఅధికారిగా కనిపించనున్నారు.

తాజాగా సినిమాకు సంబంధించి అప్‌డేట్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి అటవీప్రాంతంలో జరుగుతోండగా ఫైట్స్ సీన్స్ చిత్రీకరణ చేస్తున్నారు. రవితేజ సరసన ఈ చిత్రంలో దివ్యాంకా కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి, నాజర్, నరేశ్, పవిత్రా లోకేష్, సురేఖా వాణి కీలక పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం: సామ్‌ సీఎస్‌. సత్యన్‌ సూర్యన్‌ ఐఎస్‌సీ ఛాయాగ్రాహకులు. ప్రవీణ్‌ కేఎల్‌ ఈ చిత్రానికి ఎడిటర్‌.

- Advertisement -