జగదీశ్వర్ రెడ్డి మృతి పాలమూరు ప్రజలకు తీరనిలోటు..

17
errabelli

మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి జరగడంలో మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి తన వంతు పాత్రను పోషించారని చెప్పారు.

జగదీశ్వర్ రెడ్డి తొలి దశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆయన మరణం రాష్ట్ర ప్రజలకు,ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు తీరనిలోటని…జగదీశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఎర్రబెల్లి…ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించాలని కోరారు.