ఇండియన్ 2 తరవాత శంకర్ – సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబో సెట్టయ్యిందని టాక్ ఉంది. గేమ్ చేంజర్ తరవాత.. శంకర్ చేస్తున్న సినిమా ఇదే. వచ్చే ఏడాది ఎండింగ్ లో షూటింగ్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ చిత్రంలో ఓ తెలుగు హీరోతో పాటుగా చాలామంది స్టార్లు కనిపించే అవకాశాలు ఉన్నట్టు టాక్ నడుస్తోంది. ముఖ్యంగా రవితేజ సైతం ఓ కీలక పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే, షారుఖ్ – సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్స్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి.
కానీ, శంకర్ ప్లాప్ ట్రాక్ లో పడ్డారు. ఆయన ఆరోగ్యం కూడా ఈ మధ్య పెద్దగా సహకరించడం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. పైగా శంకర్ కి క్లారిటీ కూడా మిస్ అవుతుంది అని కోలీవుడ్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ఇండియన్ 2 సినిమానే చాలా కష్టపడి పూర్తి చేస్తున్నారు. రామ్ చరణ్ తో సినిమా పూర్తి చేసి, భారీ సినిమాలకు శంకర్ గుడ్ బై చెబుతారని ఇప్పటికే కోలీవుడ్ లో ఓ టాక్ వినిపిస్తోంది. అందుకే రజనీకాంత్ చిత్రాన్ని మరపురాని మైలురాయిగా మలచాలని శంకర్ భావిస్తున్నార్ట.
శంకర్ అడిగితే.. కోలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ అయినా సరే `ఓకే` అంటారు. అందుకే.. ఈ ప్రాజెక్టులోకి స్టార్ లంరినీ భాగస్వాములుగా చేయాలని శంకర్ భావిస్తున్నార్ట. ఏది ఏమైనా రజనీకాంత్ – రవితేజ – షారుఖ్ – సల్మాన్ ఒకే తెరపై కనిపిస్తే.. అదిరిపోతోంది. పైగా వీళ్లిద్దరూ లేటెస్టుగా సూపర్ హిట్లు ఇచ్చారు. ఇప్పుడు ఒకేసారి తెరపై కనిపిస్తే… ఇక చెప్పేదేముంది? ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరి కొత్త రికార్డులకు బీజం పడినట్టే.
Also Read:విజయ్ – పరుశరామ్..రిలీజ్ డేట్ ఫిక్స్!