వర్మ పై మెగా ఫ్యాన్స్ ఫైర్

28
- Advertisement -

రామ్‌ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న మూవీ వ్యూహం. ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా RGV మాట్లాడుతూ.. పబ్లిక్ డొమైన్ లో ఉన్న జీవితాలను సినిమాగా తీయడానికి ఎవరి పర్మిషన్ లేదు. నేను లక్ష్మీస్ ఎన్టీఆర్, సర్కార్ సినిమాలు అలా తీసినవే. నేను వైఎస్ జగన్ మీద ఉన్న అభిమానంతో సినిమా తీశాను. కానీ, ఇక్కడ ప్యాకేజ్ అనేదానికి ఆస్కారం లేదు. ఇందులో చిరంజీవి పాత్ర కూడా ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు వర్మ పై విరుచుకు పడుతున్నారు. అసలు నువ్వు మనిషివేనా ? అంటూ సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు.

అయినా, రామ్ గోపాల్ వర్మకు వివాదానికి విడదీయరాని సంబంధం ఉంది. ఆ మాటకొస్తే వివాదమే వర్మ సినిమాలకు ప్రధాన పెట్టుబడి. వివాదమే వర్మ సినిమాలో మెయిన్ ఎంటర్ టైన్మెంట్. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే వర్మ తన వ్యూహం సినిమాని జనంలోకి తీసుకు వెళ్ళడానికి మళ్లీ వివాదాన్నే ఆయుధంగా మార్చుకున్నాడు. ఈ వ్యూహం సినిమా నవంబర్ 10న విడుదల కాబోతుంది. సీఎం జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు.

మొత్తమ్మీద జగన్ మోహన్ రెడ్డిని హీరోని చేయడానికి, చంద్రబాబును – పవన్ కళ్యాణ్ ను ఎప్పటిలాగే విలన్లుగా చూపించబోతున్నాడు. ఏది ఏమైనా ఈ సంచలన దర్శకుడు ఈ వ్యూహం సినిమా గురించి చెబుతూ.. “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను. ఇది బయోపిక్ కాదు, బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయోపిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించిన “వ్యూహం” కధ, రాజకీయ కుట్రల విషం తో నిండి వుంటుంది అంటూ మొత్తానికి వర్మ పెద్ద మ్యాటరే చెప్పుకొచ్చాడు.

Also Read:విజయ్ – పరుశరామ్..రిలీజ్ డేట్ ఫిక్స్!

- Advertisement -