రవితేజ….ధమాకా అప్‌డేట్

53
Dhamaka

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రవితేజ కెరీర్‌లో 69వ సినిమా ‘ధమాకా’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. భీమ్స్ సంగీతం సమకూరుస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2022లో ‘ధమాకా’ థియేట్రికల్ విడుదలతో ప్రేక్షకులను అలరించనుంది.

తాజాగా హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. త్వరలోనే సెకండ్ షెడ్యూల్‌ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రవితేజ చేతిలో ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలున్నాయి. ఈ రెండు చిత్రాలు షూటింగ్ పూర్తయ్యే దశలో ఉన్నాయి.

రవితేజ స్పీడ్ చూసి యంగ్ హీరోలు సైతం షాక్ అయ్యేలా ఉంది పరిస్థితి. ఇంత ఫాస్ట్ గా వరుస ప్రాజెక్టులను ఒప్పుకోవడమే కాకుండా షూటింగ్ ను కూడా అంతే తొందరగా పూర్తి చేస్తున్నాడు.