ఆహాతో మోహన్‌ బాబు…టాక్ షో!

59
aha

కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. అగ్రహీరోల సినిమాలు సైతం ఓటీటీలో రిలీజ్ అవుతుండగా పలువురు హీరో,హీరోయిన్లు స్పెషల్ టాక్ షోలతో అలరిస్తున్నారు. తాజాగా పాపులర్ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా మరో పాపులర్ షోతో ముందుకురాబోతుంది.

సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో ఓటిటి ప్రాజెక్ట్ కోసం ‘ఆహా’ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆహా ప్రయత్నం సక్సెస్ అయితే త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.

ఇప్పటికే సామ్ జామ్‌ షోకు మంచి రెస్పాన్స్ రాగా త్వరలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకేని తీసుకురాబోతుంది. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మొట్టమొదటి సారిగా ఈ షోతో ఓటిటి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా హోస్టుగా మారబోతున్నారు. ఇప్పటిదాకా వెండితెరపై ఆయన నట విశ్వరూపాన్ని చూసిన ప్రేక్షకులు త్వరలోనే హోస్టుగా ఆయనలో సరికొత్త కోణాన్ని చూడబోతున్నారు. ఈ షో నవంబర్ 4న ప్రసారం కానుంది.