హైదరాబాద్ పై నాయినిది చెరగని ముద్ర

45
Minister Jagadish Reddy

హైదరాబాద్ నగరంపై దివంగత మాజీమంత్రి నాయిని నరసింహా రెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి మహానేత ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు నడిచేవని ఆయన గుర్తుచేశారు. దివంగత మాజీ మంత్రి నాయిని నరసింహా రెడ్డి ప్రధమ వర్థంతి ని పురస్కరించుకుని లోయర్ ట్యాన్క్ బండ సమీపంలోనీ పింగళి వెంకటరామ్ రెడ్డి ఫంక్షన్ హాల్ లోజరిగిన కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత నాయిని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యం బీద ప్రజల అభ్యున్నతికి కొరకై పరితపించిన మహానేత నాయిని నర్సింహారెడ్డి అని ఆయన కొనియాడారు. మంత్రి జగదీష్ రెడ్డి వెంట ఈ కార్యక్రమంలో దేవరకొండ శాసన సభ్యులు రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర తొలి హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు, మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, జగదీష్ రెడ్డి గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు తదితరులు ఉన్నారు.