సంక్రాంతికి రవితేజ.. ధమాకా!

138
Dhamaka
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, త్రినాథరావు నక్కిన ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ధమాకా” చిత్రాన్ని ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా సినిమాకు సంబంధించి ఓ వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌;డ్ టాక్‌ను సొంతం చేసుకోగా ఈ సినిమాపై మరింత దృష్టిసారించారు మేకర్స్‌. రవితేజ మార్క్ కామెడీ పాళ్లు ఎక్కవగా కలిపించే పనిలో పడ్డారట. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

- Advertisement -